MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల పరిధిలోని ప్రభుత్వ భూమిని నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు కేటాయించాలని మాజీ సర్పంచ్ అనిత కోరారు. శనివారం సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతిపత్రం అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వెనకాల ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని సాధీనం చేసుకొని పేదలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు.