CTR: సదుం మండలంలోని గొంగివారిపల్లె రాజీవ్ నగర్లో నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు గత రెండు రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం వేదకీర్తిన, పంచామృతాభిషేకాలు, మహాగణపతి అభిషేకం, నవగ్రహ హోమం, కలశ స్థాపన, సహస్ర, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాల్గొన్నారు.