WNP: వార్షిక తనిఖీలలో భాగంగా వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు శనివారం పాన్గల్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. చట్టానికి కట్టుబడి అందరూ సక్రమంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆయన సూచించారు. సిబ్బంది పనితీరును, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో నేరాలు జరగకుండా గస్తీని పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.