రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్‌కు GHMC తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ స్పందించింది. తాము క్రమం తప్పకుండా రామానాయుడు స్టూడియో తరఫున ట్రేడ్ లైసెన్స్, GHMC జారీ చేసిన నోటీసులకు అనుగుణంగానే కడుతున్నామని పేర్కొంది. ప్రాపర్టీ టాక్స్, అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు రెండూ GHMC కలెక్ట్ చేస్తుందని స్పష్టం చేసింది.