ADB: ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి అన్నారు. రైతులు భూసారానికి అనుగుణంగా ఎరువులను వాడితే అధిక దిగుబడులను పొందవచ్చని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షల కిట్లను ఏఈఓలకు శనివారం అందజేశారు. ఈ మేరకు భూసార పరీక్షలపై వారికి శిక్షణ ఇచ్చారు.