KKD: ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటించాలని జగ్గంపేట ఎస్సై రఘునాధరావు సూచించారు. శనివారం జగ్గంపేట సెంటర్లో తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చునే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతీ ద్విచక్ర వాహనానికి నంబర్ ప్లేట్ ఉండాలన్నారు. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Tags :