ప్రకాశం: ఒంగోలులోని రూడ్ సెట్ కార్యాలయంలో ఈ నెల 24 నుంచి 31 రోజుల పాటు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ ఉచిత శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు, శిక్షణ కాలంలో ఉచితంగా భోజన వసతి సైతం కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.