కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో నవ్య మండల సమాఖ్య కార్యనిర్వాహక సభ్యులు మొదటి విడతలో ఎంపికైన 8 మోడల్ మండల సమాఖ్యల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ శిక్షణ ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి మండల సమాఖ్య కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని ఏపీఎం పాండురంగ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.