KNR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తీర్పు తెలంగాణ పల్లెల్లో మరోసారి రాబోతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గతానికంటే భిన్నంగా ఈసారి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని దాంట్లో భాగంగా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామన్నారు.