TG: సినిమాల పైరసీ కేసులో iBOMMA రవి 3వ రోజు కస్టడీ విచారణ ముగిసింది. పోలీసుల విచారణకు అతను ఏ మాత్రం సహకరించట్లేదని సమాచారం. ఈ క్రమంలో రవి పొంతన లేని సమాధానాలు చెప్పాడని.. సెర్వర్ల యూజర్ ID, పాస్వర్డ్ అడిగితే గుర్తు లేదు, మర్చిపోయా అని బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఎథికల్ హ్యకర్లతో హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.