KMM: సీపీఎం రాష్ట్ర నాయకులు సామినేని రామారావును హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం తమ్మినేని సుబ్బయ్య భవన్లో సీపీఎం ఖమ్మం రూరల్ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. హత్య జరిగి 23 రోజులవుతున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.