JN: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు. ఇవాళ పాలకుర్తిలో సీఐటీయు నేతలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. దీని వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కార్పోరేట్ వాళ్ళే మళ్ళీ లాభం పొందుతారు అన్నారు.