పంజాబ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ గాయకుడు హర్మాన్ సిద్ధూ(37) మృతి చెందాడు. మన్సా-పాటియాలా రోడ్డులోని స్థానిక ప్యాలెస్ సమీపంలో అతడి కారు ట్రక్కును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వసంమవడంతో హర్మాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.