GNTR: గుంటూరు తూర్పు పరిధిలోని 44, 46, 47, వార్డు సచివాలయాలను శనివారం MLA నసీర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డు సచివాలయాల్లో సరైన సదుపాయాలు నిర్వహించట్లేదని, రిజిస్టర్ మెయింటెనెన్స్ సరిగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల కోసం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో ఎంప్లాయిస్ హాజరు కావట్లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నసీర్ హెచ్చరించారు.