ADB: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధి జరిగిందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలని అన్నారు. పట్టణంలోని శాంతినగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ శివ పంచాయతన సహిత అభయాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.