KNR: వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో శనివారం పర్సన్ ఇంఛార్జ్ బిల్లా వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఎరువుల పుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు దొనపాటి రామ్ రెడ్డి, చెల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి, మొలుగూరి సంపత్, కౌడగాని మోహన్ రావు పాల్గొన్నారు.