KMM: తిరుమలాయపాలెం మండలానికి చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటగా సీఎంఆర్ఎఫ్ సహాయం అందిందని ఆత్మ కమిటీ ఛైర్మన్ చావా శివ రామకృష్ణ తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మొత్తం 49మంది లబ్ధిదారులకు రూ. 19.84 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.