VZM: జామి పీఎసీఎస్ కేంద్రంలో ఏవో ఎం. పూర్ణిమ ఇవాళ ఇంచార్జి తాహసీల్దార్ మూర్తితో కలసి ప్రారంభించారు. మండలంలో గల అన్ని రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. రైతుల నుంచి సాధారణ రకం క్వింటాకు రూ. 2,369, ఏ గ్రేడ్ రకం రూ.2,389 గా తీసుకోనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.