SRD: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో సత్తయ్య అన్నారు. మండల కేంద్రమైన కంగ్టిలో MPP సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 9గంటలకు మండలంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున, పార్టీల అధ్యక్ష కార్యదర్శులు, అధికారులు మీడియా మిత్రులు విధిగా హాజరు కావాలని కొరారు.