SKLM: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస (మం) బాలిగాం బ్రిడ్జి సమీపాన ఇవాళ సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్ను ఢీకొంది. క్షతగాత్రుడికి వెంటనే హరిపురం CHCకి తరలిస్తుండగా మరణించాడని డాక్టర్లు తెలిపారు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు.