MDK: తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఇవాళ నర్సాపూర్‌లో మహిళలకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను, ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.