MDK: నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో ఇవాళ అయ్యప్ప సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో సన్నిధానం ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. తన సొంత ఖర్చులతో సన్నిధానాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ కన్యస్వామికి అయ్యప్ప స్వాములు, గ్రామస్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో దాతల సహకారంతో ఆలయం నిర్మించుకుంటామని పేర్కొన్నారు.