AP: విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కోసం కేంద్రం నుంచి రూ.11 వేల కోట్లు తీసుకొచ్చామని గుర్తుచేశారు. విశాఖ వేదికగా ఇటీవల జరిగిన CII సమ్మిట్ తర్వాత ప్రపంచమే రాష్ట్రంవైపు చూస్తోందన్నారు.