W.G: వీరవాసరం- తోకలపూడి రైల్వే గేటును ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు భీమవరం రైల్వే అధికారులు ఇవాళ తెలిపారు. రైల్వే ట్రాక్ సాధారణ మరమ్మతులు కారణంగా ఈనెల 25 మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 29 శనివారం సాయంత్రం 7 గంటల వరకు రైల్వే గేటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు గమనించాలని అధికారులు తెలిపారు.