WGL: ఖిలా వరంగల్ మండలంలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్న రైతుల భూములను జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడి సాగు విధానాలు, నీటి లభ్యత, మార్కెట్ ధరలు, పంట నష్టాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు తక్షణ సహాయం, సాంకేతిక సలహాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.