W.G: పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఎంఈవోలు వి.హనుమ, పీఎంకే. జ్యోతి కోరారు. ఇవాళ తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో మండల స్థాయి సబ్జెక్టు సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు బోధన సామర్థ్యాలతో పాటు నైతిక విలువలు పెంచాలన్నారు. డిసెంబర్ 5న జరిగే మెగా పేరెంట్స్ డే ను జయప్రదం చేయాలన్నారు.