ELR: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇవాళ ‘విజయకేత’ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు లక్ష్యంగా ఈ పుస్తకాలను రూపొందించారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పద్మశ్రీ చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే బడేటి చంటి, డీఈవో వెంకట లక్ష్మమ్మ పాల్గొన్నారు.