SGR: పోలీసులకు ఫిట్నెస్ కీలకమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల ఆరోగ్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.