HYD: తక్కువ పన్ను కడుతున్నారంటూ GHMC జారీ చేసిన నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ స్పందించింది. తాము ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ టాక్స్ రెండూ GHMC నిబంధనల ప్రకారమే క్రమం తప్పకుండా కడుతున్నామని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది. 68,276 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాకు సంబంధించి రికార్డ్స్ ప్రకారం పన్ను కడుతున్నామని పేర్కొంది.