ATP: మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ YCP సమన్వయకర్త డా.సాకే శైలజానాథ్ మాతృమూర్తి సాకే గంగమ్మ పార్థివ దేహానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతపురం నాయక్నగర్లోని శైలజానాథ్ నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి, గంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.