కోనసీమ: భాష, సాహిత్య సంపదను, కళా సంస్కృతిని భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన అవసరం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబాజీపేటలో శనివారం జరిగిన అరిగెల బలరామమూర్తి సాహితీ కళాపీఠం తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాహిత్యాన్ని, కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ బలరామమూర్తి కళాపీఠం చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.