కృష్ణా: పెనమలూరులోని గ్రీన్ స్కూల్లో విద్యా మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి, క్రమ శిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన అభినందించారు.