TG: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పరిపాలన విభాగంలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 32 మంది IPSలను బదిలీ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం కలెక్టర్ల బదిలీలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మరో రెండు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.