AP: విశాఖలో జరిగిన CII సమ్మిట్ తర్వాత ప్రపంచమే మనవైపు చూస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో YCP నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ఐదేళ్లు ఉక్కు పరిశ్రమ కోసం YCP నేతలు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే విశాఖ ఉక్కు కోసం కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చాం’ అని తెలిపారు.