W.G: పాలకొల్లులోని బీఆర్ఎంవీ మున్సిపల్ హైస్కూల్లో మండల విద్యాశాఖాధికారులు వీరాస్వామి, శర్మల ఆధ్వర్యంలో ఇవాళ టీచర్ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. లాంగ్ ఆబ్సెంట్ అయిన విద్యార్థులను బడికి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలు, విద్యా బోధనలో మెరుగుదల, రెమీడియల్ టీచింగ్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.