VSP: విశాఖ జీవీఎంసీ 32వ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్లిపురంలోని 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే 170 మంది నిరుపేదలకు కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.