WNP: విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ కృషి చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు.శనివారం కొత్తకోట మండలం విలియంకొండ గ్రామంలో రాజా బహుదూర్ వెంకట్రాంరెడ్డి పాఠశాల అదనపు గదులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజా బహుదూర్ విద్యాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.