కృష్ణా: ఆవులకు చర్మవ్యాధి రాకుండా ప్రభుత్వం ఉచితంగా వేసే ఎల్ఎస్డీ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సిహెచ్. నరసింహులు కోరారు. ఆవులకు ముద్ద చర్మవ్యాధి రాకుండా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ చింతకుంటపాలెంలో ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.