KMM: సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్లోని ప్రసాద్ గృహప్రవేశ కార్యక్రమానికి శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు గండుగులపల్లి గ్రామంలో మంత్రి నివాసంలో తుమ్మలతో సమావేశమయ్యారు.