TG: మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎవరనేది తమకు తెలియదని లొంగిపోయిన మావోయిస్టు కొయ్యడ సాంబయ్య తెలిపారు. పార్టీకి చెప్పిన తర్వాత తాము లొంగిపోయామన్నారు. మిగితా వారు కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని నడిపించడం కష్టమన్నారు. తమ ఆరోగ్యం కూడా సహకరించడం లేదన్నారు. అందుకే జనజీవన స్రవంతిలో కలుస్తున్నామన్నారు.