CTR: పుంగనూరు -రామసముద్రం రహదారిలోని పుంగమ్మ కట్టపై ఉన్న వంతెన వద్ద పిట్ట గోడ లేకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు, పాదాచారులతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ గోడను నిర్మించాలని కోరుతున్నారు.