కోనసీమ: ప్రతి ఒక్క పేద కుటుంబానికి సొంత ఇల్లు ఏర్పాటే సీఎం చంద్రబాబు సంకల్పమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. శనివారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన జిల్లా హౌసింగ్ అధికారులు నాలుగు మండలలా ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.