JN: పార్టీ ఫిరాయింపు కేసులపై స్పీకర్ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఇవాళ పట్టణ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా పై స్పీకర్ నిర్ణయమే తుది అని, నియోజకవర్గ ప్రజలు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నానని తెలిపారు. ఉప ఎన్నిక వచ్చినా తానే పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.