సౌతాఫ్రికాతో గౌహతి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ప్రస్తుతం ముత్తుసామీ(25), వెరెయిన్(1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు మార్క్రమ్ 38, రికెల్టన్ 35, స్టబ్స్ 49, బవుమా 41, జోర్జి 28, ముల్డర్ 13 రన్స్ చేసి వెనుదిరిగారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు తీశాడు.