ADB: ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఉట్నూరు మండలంలోని బీర్సాయ్ పేట్, దంతన్ పల్లి గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు శనివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు.