సత్యసాయి: సత్యసాయి బాబా శత జయంతోత్సవాలలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలిసి పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం బాబా అందించిన సేవను రాష్ట్రపతి చక్కగా వివరించారని పేర్కొన్నారు. బాబా బోధించిన సత్యం, శాంతి, ప్రేమ, సేవ సిద్ధాంతాలు మనకు స్ఫూర్తినిస్తాయని, ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు