KMM: కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటైనప్పటికీ, కల్లూరు ఏసీపీ అధికారులు మాత్రం సత్తుపల్లిలోని కార్యాలయం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. పేరుకు కల్లూరు ఏసీపీ అయినా, కార్యాలయం సత్తుపల్లిలో ఉండటం పట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆరు మండలాలకు మధ్యస్థంగా ఉన్న కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోనే ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.