ATP: శింగనమల మార్కెట్ యార్డు ఛైర్మన్ దండు శ్రీనివాసులు శనివారం యార్డు పరిధిలోని కల్లూరు మార్కెట్ సబ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ పనితీరు, కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శింగనమల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. యార్డులో రైతులకు సక్రమంగా సేవలు అందేలా చూడాలని ఛైర్మన్ అధికారులకు సూచించారు.