KKD: కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో శనివారం ఓ బోటు అలల ధాటికి బోల్తా పడింది. అమీనాబాద్కు చెందిన మత్స్యకారుడు తాతారావు శుక్రవారం వేట ముగించుకుని, బోటుకు లంగరు వేసి వెళ్లాడు. అయితే అలల ఉధృతికి తాడు తెగిపోవడంతో బోటు తిరగబడింది. విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు తీవ్రంగా శ్రమించి, ధ్వంసమైన బోటును ఒడ్డుకు చేర్చారు.