NGKL: తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సిఫారసుల మేరకు భారత వరి పరిశోధన సంస్థ అందించిన భూసార పరీక్ష కిట్లను జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ పంపిణీ చేశారు. కలెక్టరేట్లో జిల్లాలోని ఏఈవోలకు ఈ కిట్లు అందజేశారు. జడ్చర్ల భూసార పరీక్ష కేంద్రం ఏవో రేవతి ఆధ్వర్యంలో ఈ కిట్లను ఉపయోగించి భూసార పరీక్షలు నిర్వహించే విధానంపై శిక్షణ అందించారు.